FARZI: ఆ యువకుడు డబ్బులను సొంతంగా ఎలా ముద్రించాడు?
FARZI: షాహిద్ కపూర్, విజయ్‌సేతుపతి కీలక పాత్రల్లో నటించిన ‘ఫర్జీ’ ట్రైలర్ వచ్చేసింది.
ఇంటర్నెట్‌డెస్క్: ‘డబ్బుతో సంతోషాన్ని కొనలేం.. అలా చెప్పినోడు చేతిలో నయా పైసా లేనోడు.. నేను ఎంత డబ్బు సంపాదించాలంటే, ఆ డబ్బు మీద నాకు మోజు పోవాలి’ అంటున్నారు షాహిద్ కపూర్ (Shahid Kapoor). ఆయన కథానాయకుడిగా నటించిన వెబ్‌సిరీస్ ‘ఫర్జీ’. విజయ్ సేతుపతి (Vijay Sethupathi), కేకే మేనన్, రాశీఖన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ది ఫ్యామిలీమ్యాన్(The Family Man) సిరీస్‌తో సూపర్‌హిట్ విజయాన్ని అందుకొని సంచలనం సృష్టించిన దర్శకులు రాజ్-డీకే ఈ ‘ఫర్జీ’ (Farzi)ని తీర్చిదిద్దారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
అన్నింటిలోనూ టాలెంటెడ్ అయిన యువకుడు డబ్బు కోసం దొంగనోట్లను ఎలా తయారు చేశాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? పోలీసులు అతడిని పట్టుకున్నారా? తెలియాలంటే ‘ఫర్జీ’ చూడాల్సిందే! సంక్రాంతి కానుకగా ఈ సిరీస్ తెలుగు ట్రైలర్‌ను అమెజాన్‌ప్రైమ్ వీడియో విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శకులు రాజ్-డీకే మాట్లాడుతూ తమకు ఇష్టమైన స్క్రిప్ట్‌ల్లో ఇదీ ఒకటని అన్నారు. ఎంతో అభిరుచితో రూపొందించామని తెలిపారు. ‘ది ఫ్యామిలీమ్యాన్’ సిరీస్‌లానే ఇది కూడా అందరికి నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Virat - Babar: విరాట్‌తో ఎవరినీ పోల్చలేం: పాకిస్థాన్ మాజీ కెప్టెన్
-
Movies News
Samantha: తన బెస్ట్ ఫ్రెండ్స్‌ని పరిచయం చేసిన సమంత
-
Politics News
BRS: సమరానికి సై.. పార్లమెంట్లో భారాస వ్యూహంపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం
-
World News
Pakistan: పాక్‌లో ఘోర ప్రమాదం.. 42మంది మృత్యువాత
-
General News
KTR: అమెరికాలో సదస్సుకు మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం
-
India News
Beating Retreat: సైనిక విన్యాసాలు భళా.. 3,500 డ్రోన్లతో మెగా షో.. వీక్షించండి