Fighter: ఓటీటీలోకి యాక్షన్‌ హంగామా ‘ఫైటర్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే!

హృతిక్ రోషన్‌ నటించిన ‘ఫైటర్‌’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.

Published : 20 Mar 2024 20:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ స్టార్స్‌ హృతిక్ రోషన్‌ (Hrithik Roshan), దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫైటర్‌’ (Fighter). సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. మార్చి 20 రాత్రి 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా అందుబాటులో ఉండనుంది. నెట్‌ఫ్లిక్స్‌ ఈవిషయాన్ని సడెన్‌గా ప్రకటించడంతో యాక్షన్‌ ప్రియులు ఆనందిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాలో అనిల్‌ కపూర్‌, కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌, అక్షయ్‌ ఒబెరాయ్‌, సంజీవ్‌ జైశ్వాల్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

ఇదీ ‘ఫైటర్‌’ కథ: సంషేర్ ప‌ఠానియా అలియాస్ పాటీ (హృతిక్ రోష‌న్‌) భార‌త వైమానిక ద‌ళంలో స్క్వాడ్ర‌న్ లీడ‌ర్‌. సాహ‌సాల‌కి వెనకాడ‌ని ఫైట‌ర్ పైల‌ట్‌. అప్ప‌జెప్పిన బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించే క్ర‌మంలో త‌న‌కున్న ప‌రిధుల్ని, నిబంధ‌న‌ల్ని దాటి మ‌రీ సాహ‌సాలు చేస్తుంటాడు. ఆ క్ర‌మంలోనే జ‌రిగిన ఓ దుస్సంఘ‌ట‌న‌కి బాధ్యుడిగా నింద‌ని మోస్తూ ఉంటాడు.  రెండేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఓ ఆప‌రేష‌న్ కోసం శ్రీన‌గ‌ర్ వ‌స్తాడు. సీవో రాకీ (అనిల్ క‌పూర్‌) నేతృత్వంలో మిన్ను అలియాస్ మిన‌ల్ సింగ్ రాఠోడ్‌ (దీపికా ప‌దుకొణె), తాజ్ (క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్‌), బాష్ (అక్ష‌య్ ఒబెరాయ్‌) బృందం రంగంలోకి దిగుతుంది. గ‌గ‌న‌త‌లంలో శ‌త్రువుల‌పై వాళ్ల పోరాటం ఎలా సాగింది? పాటీ మ‌ళ్లీ నిబంధ‌న‌ల్ని అతిక్ర‌మించాడా? రెండేళ్ల కింద‌ట జ‌రిగిన ఆ సంఘ‌ట‌న ఏమిటి? త‌నకు ఎదురైన స‌వాళ్ల‌ని దాటి పాటీ నిజ‌మైన ఫైట‌ర్ అని ఎలా చాటుకున్నాడు? త‌దిత‌ర విష‌యాల్ని నెట్‌ఫ్లిక్స్‌లో చూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని