TFPC: ఆదివారం సినిమా షూటింగులు బంద్‌

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మరణవార్త తెలుగు చిత్ర పరిశ్రమను తీవ్రంగా కలచివేసింది.

Updated : 08 Jun 2024 12:46 IST

హైదరాబాద్‌: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు (Ramoji Rao) మరణవార్త తెలుగు చిత్ర పరిశ్రమను తీవ్రంగా కలచివేసింది. ఆయన మృతికి సంతాప సూచకంగా ఆదివారం చిత్ర పరిశ్రమ బంద్‌కు పిలుపునిచ్చినట్లు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రకటించింది. షూటింగులను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు నిర్మాతల మండలి ఓ ప్రకటన విడుదల చేసింది.

మరోవైపు పలువురు సినీ ప్రముఖులు రామోజీరావుకు నివాళులర్పించారు. ఫిల్మ్‌సిటీలో ఆయన పార్థివదేహం వద్ద అంజలి ఘటించారు. మోహన్‌బాబు, రాఘవేంద్రరావు, రాజమౌళి, కీరవాణి, శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి, నరేశ్‌, కల్యాణ్‌రామ్‌, సాయికుమార్‌ తదితరులు నివాళులర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని