ఫిల్మ్‌ఫేర్‌ ఓటీటీ అవార్డుల ప్రదానోత్సవం.. విజేతలు ఎవరంటే..?

ఫిల్మ్‌ఫేర్‌ ఓటీటీ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు వినోదం అందించిన పలువురు నటీనటులకు ఈ అవార్డులను అందించారు.

Published : 27 Nov 2023 16:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుత రోజుల్లో వెండితెరకు దీటుగా ప్రేక్షకులకు వినోదం అందిస్తుంది ఓటీటీ మాధ్యమం. ఈ నేపథ్యంలోనే డైరెక్ట్‌ ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించే నటీనటులు, దర్శకులను ప్రోత్సహించడం కోసం గత కొంతకాలంగా ఫిల్మ్‌ఫేర్‌ ఓటీటీ అవార్డులను అందిస్తున్నారు. అలా, ఈ ఏడాది ‘ఫిల్మ్‌ఫేర్‌ ఓటీటీ’ అవార్డులను పలువురు తారలు సొంతం చేసుకున్నారు. వెబ్‌ ఒరిజినల్‌ విభాగంలో ఉత్తమ నటిగా అలియాభట్‌, ఉత్తమ నటుడిగా మనోజ్‌బాజ్‌ పాయ్‌ అవార్డులు అందుకున్నారు.

విజేతలు వీరే..!

 • వెబ్‌సిరీస్‌ (డ్రామా) విభాగం:
 • ఉత్తమ దర్శకుడు : విక్రమాదిత్య మోత్వానీ (జూబ్లీ)
 • ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్‌) : రణ్‌దీప్‌ జా (కొహరా)
 • ఉత్తమ నటుడు : సువేంద్ర విక్కీ (కొహరా)
 • ఉత్తమ నటి : రాజశ్రీ దేశ్‌పాండే (ట్రైయిల్‌ బై ఫైర్‌)
 • ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌):  విజయ్‌ వర్మ (దహడ్‌)
 • ఉత్తమ నటి (క్రిటిక్స్‌): కరిష్మా తన్నా (స్కూప్‌), సోనాక్షి సిన్హా (దహడ్‌)
 • ఉత్తమ సహాయ నటుడు: బరున్‌ సోబ్తి (కొహరా)
 • ఉత్తమ సహాయ నటి : తిలోత్తమ (దిల్లీ క్రైమ్‌ సీజన్‌ 2)
 • వెబ్‌ సిరీస్‌ - కామెడీ
 • ఉత్తమ నటుడు : అభిషేక్‌ బెనర్జీ (ది గ్రేట్‌ వెడ్డింగ్స్‌ ఆఫ్‌ మున్నెస్)
 • ఉత్తమ నటి : మాన్వీ గాగ్రూ (టీవీఎఫ్‌ ట్రిప్లింగ్‌)
 • ఉత్తమ సహాయ నటుడు : అర్ణభ్‌ కుమార్‌ (టీవీఎఫ్‌ పిట్చర్స్‌)
 • ఉత్తమ సహాయ నటి : షెర్నాజ్ పటేల్ (టీవీఎఫ్‌ ట్రిప్లింగ్‌ సీజన్‌ 3)
 • ఉత్తమ కామెడీ సిరీస్‌ - టీవీఎఫ్‌ పిట్చర్స్‌ సీజన్‌ 2
 • ఉత్తమ నాన్‌ ఫిక్షనల్‌ ఒరిజినల్‌ - సినిమా మార్టే దమ్‌ తక్‌
 • వెబ్‌ ఒరిజినల్‌
 • ఉత్తమ వెబ్ ఒరిజినల్ - సిర్ఫ్‌ ఏక్‌ బందా కాఫీ హై
 • ఉత్తమ దర్శకుడు - అపూర్వ సింగ్‌ ఖర్కీ (సిర్ఫ్‌ ఏక్‌ బందా కాఫీ హై)
 • ఉత్తమ నటుడు : మనోజ్‌బాజ్‌ పాయ్‌ (సిర్ఫ్‌ ఏక్‌ బందా కాఫీ హై)
 • ఉత్తమ నటి : అలియా భట్‌ (డార్లింగ్స్‌)
 • ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌) : రాజ్‌కుమార్‌ రావ్‌ (మోనికా ఓ మై డార్లింగ్‌)
 • ఉత్తమ నటి (క్రిటిక్స్‌): షర్మిలా ఠాకూర్‌ (గుల్మోహర్) 
 • ఉత్తమ సహాయ నటుడు :  సూరజ్‌ శర్మ(గుల్మోహర్)
 • ఉత్తమ సహాయ నటి : అమృతా సుభాష్‌ (లస్ట్‌ స్టోరీస్‌ 2), షెఫాలీ షా (డార్లింగ్స్‌)
   
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని