Akshay Kumar: 200 గుర్రాలతో భారీ యాక్షన్‌

హిందీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’ ఒకటి. అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో అహ్మద్‌ ఖాన్‌ తెరకెక్కిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది.

Published : 24 May 2024 01:23 IST

హిందీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’ ఒకటి. అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో అహ్మద్‌ ఖాన్‌ తెరకెక్కిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. ‘వెల్‌కమ్‌’ ఫ్రాంచైజీలో రానున్న ఈ మూడో భాగంలో దిశా పటానీ, రవీనా టాండన్, జాక్వెలెన్‌ ఫెర్నాండజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ముంబయిలో ఓ భారీ యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ పూర్తైనట్లు సమాచారం. ‘దాదాపు 200 గుర్రాలతో పవర్‌ ప్యాక్డ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ని చిత్రీకరించారు. ఏడు రోజుల పాటు జరిగిన ఈ షూటింగ్‌లో సన్నివేశాల్ని మునుపెన్నడూ చూడని విధంగా తీర్చిదిద్దారు. పది ఎకరాల స్థలంలో భారీ సెట్‌ వేసి ఈ ఘట్టాల్ని రూపొందించారు’ అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. క్రిస్మస్‌ కానుకగా ఈ ఏడాది డిసెంబరు 20న ఈ సినిమా అభిమానుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని