Skanda: ప్రాణమే ఎగిరే పతంగిలా...!

‘‘ప్రాణమే పతంగిలాగ ఎగురుతోందిగా. ఇంతలో తతంగమంత మారుతోందిగా. క్షణాలలో ఇదేమిటో.

Updated : 04 Aug 2023 14:04 IST

‘‘ప్రాణమే పతంగిలాగ ఎగురుతోందిగా. ఇంతలో తతంగమంత మారుతోందిగా. క్షణాలలో ఇదేమిటో. నన్ను అంతు చేసే ముంత కల్లులాంటి కళ్లలోన తేలగా’’ అంటూ ప్రేయసితో కలిసి ప్రేమ పాట పాడుకుంటున్నారు కథానాయకుడు రామ్‌. ఆయన.. శ్రీలీల జంటగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘స్కంద’. బోయపాటి శ్రీను దర్శకుడు. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. ఈ సినిమా సెప్టెంబరు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వంలో భాగంగా గురువారం ఈ చిత్రం నుంచి తొలి గీతాన్ని విడుదల చేశారు. ‘‘నీ చుట్టు చుట్టు చుట్టు చుట్టు తిరిగినా. నా చిట్టి చిట్టి చిట్టి చిట్టి గుండెనడిగినా. నా దిమ్మతిరిగె బొమ్మ ఎవరిదంటె నిన్ను చూపుతోందిగా..’’ అంటూ సాగుతున్న ఈ పాటకు తమన్‌ స్వరాలు సమకూర్చగా.. రఘురామ్‌ సాహిత్యమందించారు. సిద్‌ శ్రీరామ్‌, సంజన కల్మంజే ఆలపించారు. పాటలో రామ్‌ - శ్రీలీల కనిపించిన తీరు.. ఇద్దరు వేసిన హుషారైన స్టెప్పులు హైలైట్‌గా నిలిచాయి. మాస్‌ యాక్షన్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌ మునుపెన్నడూ చూడని శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు.నిర్మాణాంతర పనులుముగింపు దశలో ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని