Telangana assembly Elections 2023: తెలంగాణ ఎన్నికలు.. సినీ తారల ఫన్నీ మూమెంట్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలు సరదాగా సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. దీనికి సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

Updated : 30 Nov 2023 14:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly Elections 2023) కొనసాగుతున్నాయి. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు రాజకీయ నాయకులు, ప్రజలు పోలింగ్‌ కేంద్రాల వద్దకు తరలివస్తున్నారు. మరోవైపు సినీ తారలు పోలింగ్‌పై ఆసక్తి చూపుతున్నారు. తమ ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి ఉదయం నుంచే ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే పలు సరదా సన్నివేశాలు చోటుచేసుకున్నాయి.

కుటుంబసభ్యులతో కలిసి జూబ్లీహిల్స్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు చిరంజీవి (Chiranjeevi). ఈ సందర్భంగా ఓ విలేకరి ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. తాను మౌనవ్రతంలో ఉన్నానని చిరంజీవే చెప్పడం నవ్వులు పూయిస్తోంది. ఇక జూబ్లీహిల్స్‌లోని ఓబుల్ రెడ్డి స్కూల్‌లో ఓటు వేశారు నటుడు ఎన్టీఆర్‌ (NTR). ఆయన కుటుంబసభ్యులతో కలిసి ఉదయాన్నే పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు. తారక్‌ను ఫొటోలు తీసేందుకు పలువురు ఫొటోగ్రాఫర్లు, అభిమానులు ఉత్సాహం కనబరిచారు. దీంతో ఆయన.. ‘‘మీరందరూ ఇక్కడే ఉంటారా? ఓట్లు వేయరా?’’ అని సరదాగా ప్రశ్నించారు.

జూబ్లీహిల్స్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేసిన అనంతరం అల్లు అర్జున్‌ (Allu Arjun) ఓ యువతితో సరదాగా మాట్లాడారు. ఆమెతో కలిసి ఓ వీడియో క్రియేట్‌ చేశారు. ‘‘నీకు బాగా ఫాలోవర్స్‌ రావాలని మంచి వీడియో తీస్తా. ఇప్పుడు నీకు ఎంత మంది ఫాలోవర్స్‌ ఉన్నారు’’ అని ప్రశ్నించగా.. ప్రస్తుతం తనని 13 వేల మంది ఫాలో అవుతున్నారని ఆమె చెప్పారు. ఆ సంఖ్య 30 వేలకు చేరాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ‘‘ఈ వీడియోతో ఫాలోవర్స్‌ సంఖ్య పెరగాలని కోరుకుందాం’’ అంటూ ఆయన నవ్వులు పూయించారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని