Emraan Hashmi: నన్ను సర్ అని పిలవొద్దు: టాలీవుడ్‌ యంగ్‌ హీరోతో ఇమ్రాన్‌ హష్మీ

తనను సర్‌ అని పిలవొద్దంటూ టాలీవుడ్‌ యంగ్‌ హీరోకి బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ విజ్ఞప్తి చేశారు. ఆయనెవరంటే?

Published : 15 Feb 2024 15:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మన మధ్య ఫార్మాలిటీస్‌ ఎందుకు? నన్ను సర్‌ అని పిలవొద్దు’ అంటూ ఓ యంగ్‌ హీరోకు విజ్ఞప్తి చేశారు బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ (Emraan Hashmi). ఆ యువ కథానాయకుడు మరెవరో కాదు అడివి శేష్‌ (Adivi Sesh). ఈయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘జీ 2’ (G2)లో ఇమ్రాన్‌ నటించే అవకాశం ఉందంటూ కొన్ని రోజుల క్రితం ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ రూమర్స్‌ నిజమయ్యాయి. ఇమ్రాన్‌ తమ సినిమాలో భాగమైనట్లు సోషల్‌ మీడియా వేదికగా చిత్ర బృందం వెల్లడించింది. ఈమేరకు ఆయన ఫొటోను పంచుకుంటూ వెల్‌కమ్‌ చెప్పింది. మరోవైపు, ‘‘జీ 2 యూనివర్స్‌’లోకి బ్రిలియంట్‌ యాక్టర్‌కు స్వాగతం. మీతో కలిసి నటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా సర్‌’’ అని శేష్‌ పోస్ట్‌ పెడుతూ ఆనందం వ్యక్తంచేశారు. దీనిపై ఇమ్రాన్‌ స్పందిస్తూ.. శేష్‌కు థ్యాంక్స్‌ చెప్పి, సర్‌ అనే ఫార్మాలిటీస్‌ వద్దన్నారు. త్వరలోనే కలుద్దామన్నారు.

గతంలో శేష్‌ నటించిన హిట్‌ చిత్రం ‘గూఢచారి’ (Goodachari)కి సీక్వెల్‌గా ‘జీ2’ తెరకెక్కుతోంది. వినయ్‌కుమార్‌ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు. బనితా సింధు హీరోయిన్‌. స్పై థ్రిల్లర్‌గా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఇమ్రాన్‌ ఇప్పటికే ‘ఓజీ’ (OG)తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) హీరోగా దర్శకుడు సుజీత్‌ రూపొందిస్తున్న చిత్రమిది. ఇందులో ఆయన ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబరు 27న విడుదల కానుంది. ‘జీ 2’లోనూ ఆయన విలన్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాతోపాటు ‘డెకాయిట్‌’లోనూ శేష్‌ నటిస్తున్నారు. ఇద్దరు మాజీ ప్రేమికుల నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి షానీల్‌ డియో దర్శకత్వం వహిస్తున్నారు. శ్రుతి హాసన్‌ కథానాయిక.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని