Gautham Vasudev Menon: విక్రమ్‌ సినిమా పూర్తి చేయడానికే నటుడిగా మారా: గౌతమ్‌ మేనన్‌

గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ (Gautham Vasudev Menon) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాను నటుడిగా మారడానికి గల కారణాన్ని తెలియజేశారు.

Updated : 13 Oct 2023 18:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్లాసిక్‌, విభిన్నమైన ప్రేమకథా చిత్రాలు తెరకెక్కించడంలో దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ (Gautham Vasudev Menon) దిట్ట. 2016లో విక్రమ్‌ హీరోగా ఆయన అనౌన్స్‌ చేసిన భారీ ప్రాజెక్ట్‌ ‘ధ్రువ నక్షత్రం’ (Dhruva Natchathiram). ఎన్నో అవాంతరాలు దాటుకుని ఆ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో గౌతమ్‌ మేనన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘సీతారామం’ ‘లియో’, ‘కనులు కనులను దోచాయంటే’ వంటి చిత్రాల్లో నటుడిగా కనిపించడంపై స్పందించారు. ఇష్టంతో తాను నటుడిని కాలేదని అన్నారు.

‘‘నటనపట్ల ఆసక్తితో సినిమాల్లో నటించడం లేదు. ‘ధ్రువ నక్షత్రం’ కోసమే నేను నటుడిగా మారా. ఆయా చిత్రాల్లో యాక్ట్‌ చేసినందుకుగానూ వచ్చిన పారితోషికాన్ని ఈ సినిమా మేకింగ్‌.. విడుదల కోసం ఉపయోగించా. అలాగే, సినిమాల్లో అవకాశం ఇవ్వమని నేను ఇప్పటివరకూ ఎవరినీ అడగలేదు. అలాగే, కొన్ని సినిమాల్లో అవకాశాలనూ వదులుకున్నా’’ అని ఆయన చెప్పారు.

స్పై, యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో గౌతమ్‌ మేనన్‌ ‘ధ్రువ నక్షత్రం’ చిత్రాన్ని సిద్ధం చేశారు. 2016లోనే ఈ సినిమా పట్టాలెక్కింది. 2017లో విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. చిత్రీకరణ పూర్తైనప్పటికీ అనుకోని కారణాలతో ఇది వాయిదా పడింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. నవంబర్‌ 24న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. రీతూవర్మ, సిమ్రన్‌, ఐశ్వర్య రాజేశ్‌, రాధిక, తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని