సంక్షిప్త వార్తలు(4)
జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం గెలుచుకున్నాకా బాలీవుడ్ యువ కథానాయకుడు విక్కీ కౌశల్ మరింత జాగ్రత్తగా పాత్రల్ని ఎంచుకుం టున్నారు.
‘సామ్ బహదూర్’ ఆగమనం
జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం గెలుచుకున్నాకా బాలీవుడ్ యువ కథానాయకుడు విక్కీ కౌశల్ మరింత జాగ్రత్తగా పాత్రల్ని ఎంచుకుం టున్నారు.అలా ఎంచుకున్న పాత్రే ‘సామ్ బహదూర్’ చిత్రంలోనిది. ఆర్మీ అధికారి సామ్ మానెక్షా జీవిత కథతో వస్తోన్న ఈ చిత్రానికి మేఘనా గుల్జార్ దర్శకురాలు కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే ఆమె దర్శకత్వం వహించిన ‘రాజీ’ మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ‘సామ్ బహదూర్’ను వచ్చే ఏడాది డిసెంబరు 1న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇందులో సామ్ భార్య సిల్లూగా సాన్యా మల్హోత్ర, దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీగా ఫాతిమా సనా షేక నటిస్తున్నారు. ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ పొందిన తొలి భారతీయ ఆర్మీ అధికారి సామ్ మానెక్షా.
రాజ్‌తరుణ్.. ‘తిరగబడరా సామి’!
‘యజ్ఞం’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’ వంటి విజయవంతమైన చిత్రాలతో మెప్పించిన దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి. ఇప్పుడాయన రాజ్‌తరుణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. మల్కాపురం శివకుమార్ నిర్మాత. దీనికి ‘తిరగబడరా సామి’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రం గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సి.కల్యాణ్ క్లాప్ కొట్టగా.. కె.ఎస్.రామారావు కెమెరా స్విచ్చాన్ చేశారు. పోకూరి బాబూరావు దర్శకుడికి స్క్రిప్ట్ అందించారు. ‘‘కొత్తదనం నిండిన కథాంశంతో చక్కటి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందించనున్నాం. రాజ్‌తరుణ్ సరికొత్తగా కనిపిస్తారు. త్వరలో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: జె.బి, ఛాయాగ్రహణం: జవహర్ రెడ్డి.
మూడోసారి సింగం గర్జన
అజయ్దేవ్గణ్ను యాక్షన్ అభిమానులకు మరింత దగ్గర చేశాయి ‘సింగం’ చిత్రాలు. ‘సింగం’, ‘సింగం రిటర్న్’ చిత్రాల్లో పోలీస్ పాత్రలో నటించి బాక్సాఫీసు వద్ద వసూళ్లు కురిపించారు అజయ్. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో మూడో చిత్రంగా ‘సింగం ఎగైన్’ రాబోతుంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం గత రెండు చిత్రాలను మించి ఉంటుందని తెలుస్తోంది.
హృదయాల్ని హత్తుకునే ‘ముఖచిత్రం’
వికాస్ వశిష్ఠ, ప్రియా వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ముఖచిత్రం’. గంగాధర్ దర్శకుడు. ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల సంయుక్తంగా నిర్మించారు. హీరో విష్వక్ సేన్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. చిత్ర దర్శకుడు గంగాధర్ మాట్లాడుతూ.. ‘‘ఇది చిన్న చిత్రమైనా.. విష్వక్ సేన్ వచ్చాక పెద్ద సినిమాగా మారింది’’ అన్నారు. ‘‘మంచి భావోద్వేగభరితమైన సినిమా చేశాం. కచ్చితంగా అందరి హృదయాల్ని హత్తుకునేలా ఉంటుంది’’ అంది నాయిక ప్రియా వడ్లమాని.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (03/02/23)
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
India News
IND-AUS: అలాంటి కార్యకలాపాలను అనుమతించొద్దు.. ఆస్ట్రేలియాకు భారత్ విజ్ఞప్తి
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Mussorie: ముస్సోరీలో వెంటనే అధ్యయనం చేయండి: గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశం