ప్రభాస్‌ కోసం ఓ థియేటర్‌?

ప్రభాస్‌ - మారుతి కలయికలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది.

Published : 02 Dec 2022 02:28 IST

ప్రభాస్‌ - మారుతి కలయికలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. నిధి అగర్వాల్‌, మాళవికా మోహన్‌, రిద్ది కుమార్‌ కథానాయికలుగా కనిపించనున్నారు. ఇప్పటికే ఓ చిన్న షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఈనెల రెండో వారం నుంచి మరో కొత్త షెడ్యూల్‌ ప్రారంభించుకోనుందని సమాచారం. ఇందుకోసం ప్రభాస్‌ ఇప్పటికే రంగంలోకి దిగినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయనతో పాటు కథానాయికలపై లుక్‌ టెస్ట్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌ కోసమే హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో పాతకాలం నాటి సినిమా థియేటర్‌ సెట్‌ను సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. అందులోనే ప్రభాస్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని టాక్‌. ప్రస్తుతం ప్రభాస్‌ నటించిన ‘ఆదిపురుష్‌’ విడుదలకు సిద్ధమవుతుండగా.. ‘సలార్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రీకరణ దశలో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని