దశగ్రీవ రావణ

‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ విజయాలతో జోరు మీదున్నారు రవితేజ. ఇప్పుడీ జోష్‌లోనే ‘రావణాసుర’గా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని సుధీర్‌ వర్మ తెరకెక్కిస్తున్నారు.

Updated : 07 Feb 2023 14:06 IST

‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ విజయాలతో జోరు మీదున్నారు రవితేజ. ఇప్పుడీ జోష్‌లోనే ‘రావణాసుర’గా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని సుధీర్‌ వర్మ తెరకెక్కిస్తున్నారు. ఆర్‌.టి.టీమ్‌ వర్క్స్‌, అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఏప్రిల్‌ 7న విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార పర్వాన్ని వేగవంతం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా సోమవారం ఈ చిత్ర థీమ్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ‘‘దశగ్రీవ రావణా’’ అంటూ సాగుతున్న ఈ పాటకు హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ స్వరాలు సమకూర్చగా.. వేదిక్‌ బ్యాండ్‌ శాంతి పీపుల్‌, నోలిక్‌ సంయుక్తంగా ఆలపించారు. స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో న్యాయవాదిగా సరికొత్త లుక్‌తో కనిపించనున్నారు రవితేజ. అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్‌, పూజిత పొన్నాడ కథానాయికలు. సుశాంత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని