ఆ దళారి ఎవరు?

షకలక శంకర్‌, అక్సఖాన్‌, రూపిక నాయకానాయికలుగా కాచిడి గోపాల్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘దళారి’. ఎడవెల్లి వెంకటరెడ్డి నిర్మాత.

Published : 09 Feb 2023 01:57 IST

కలక శంకర్‌, అక్సఖాన్‌, రూపిక నాయకానాయికలుగా కాచిడి గోపాల్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘దళారి’. ఎడవెల్లి వెంకటరెడ్డి నిర్మాత. రాజీవ్‌ కనకాల కీలక పాత్ర పోషించారు. ఈ టీజర్‌ను వేములవాడలో ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో శంకర్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నా. దర్శకుడు కథ చెప్పినప్పుడే నాకు చాలా నచ్చేసింది. ఇది మీ అందరినీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నా’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలోని కథ, పాటలు, డ్యాన్సులు, ఎమోషన్స్‌.. ప్రతిదీ ప్రేక్షకుల్ని అలరిస్తాయి’’ అన్నారు నిర్మాత వెంకట రెడ్డి. ఈ కార్యక్రమంలో మధు ప్రియ, జిఎల్‌ నాందేవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని