సంక్షిప్త వార్తలు(2)

ప్రముఖ మలయాళ నటుడు ఇన్నోసెంట్‌ (75) ఇకలేరు. శ్వాసకోశ సమస్యలతో బాధ పడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. 1972లో ‘నృత్యశాల’ సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టారు.

Published : 28 Mar 2023 02:59 IST

మలయాళ నటుడు ఇన్నోసెంట్‌ కన్నుమూత

ప్రముఖ మలయాళ నటుడు ఇన్నోసెంట్‌ (75) ఇకలేరు. శ్వాసకోశ సమస్యలతో బాధ పడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. 1972లో ‘నృత్యశాల’ సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టారు. చిత్ర పరిశ్రమలో హాస్య పాత్రలతో ప్రశంసలు అందుకొని గుర్తింపు పొందారు. నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా, మలయాళీ సినీ కళాకారుల సంఘం మాజీ అధ్యక్షుడిగానూ ఉన్నారు. ‘రామ్‌జీరావు స్పీకింగ్‌’, ‘మన్నార్‌ మత్తై స్పీకింగ్‌’, ‘మిథునం’, ‘కళ్యాణరామన్‌’, ‘గజకేసరియోగం’ లాంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో మేటి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇన్నోసెంట్‌ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.


నవ్వులు పంచే ‘పరారీ’

యోగేశ్వర్‌, అతిధి జంటగా సాయి శివాజీ తెరకెక్కించిన చిత్రం ‘పరారీ’. జి.వి.వి.గిరి నిర్మాత. సుమన్‌, మకరంద్‌ దేశ్‌ముఖ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంలోని ‘‘ఎల్ల ఎల్ల’’ గీతాన్ని దర్శకుడు త్రినాథరావు నక్కిన విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను సినిమా చూశా. నిర్మాణ విలువలు బాగున్నాయి. పాటలు కూడా ఓ రేంజ్‌లో ఉన్నాయి. అందరూ ఈ చిత్రాన్ని చూసి ఆశీర్వదించండి’’ అన్నారు. ‘‘కొంతమంది యువకులు ఓ సమస్యపై చేసిన పోరాటమేంటన్నది ఈ చిత్ర కథాంశం. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. అందరూ ఈ సినిమాని ఆదరించి పెద్ద హిట్‌ చేస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు సంగీత దర్శకుడు మహిత్‌ నారాయణ్‌. కార్యక్రమంలో గిరి, యోగేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని