పేరు... ఖరారు

శంకర్‌ - రామ్‌చరణ్‌ కలయికలో రూపొందుతున్న సినిమాకి ‘గేమ్‌ ఛేంజర్‌’ అనే పేరు ఖరారైంది. రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఈ పేరుని అధికారికంగా ప్రకటించాయి సినీవర్గాలు.

Published : 28 Mar 2023 03:05 IST

శంకర్‌ - రామ్‌చరణ్‌ కలయికలో రూపొందుతున్న సినిమాకి ‘గేమ్‌ ఛేంజర్‌’ అనే పేరు ఖరారైంది. రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఈ పేరుని అధికారికంగా ప్రకటించాయి సినీవర్గాలు. కొన్ని రోజులుగా రకరకాల పేర్లు ప్రచారంలో ఉండగా... ఎవరూ ఊహించని విధంగా ‘గేమ్‌ ఛేంజర్‌’ పక్కా అయ్యింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న సినిమా ఇది. రామ్‌చరణ్‌ సరసన కియారా అడ్వాణీ నటిస్తోంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా పేరుని ఓ వీడియోతోపాటు ప్రకటించగా, ఫస్ట్‌లుక్‌ని కూడా సోమవారం విడుదల చేశారు. అందులో రామ్‌చరణ్‌ స్టైలిష్‌ అవతారంలో సందడి చేశారు. ఆయనొక యువ ఐఏఎస్‌ అధికారిగా కనిపిస్తారని సమాచారం. రాజకీయం, ఎన్నికల వ్యవస్థ చుట్టూ సాగే కథతో ఈ చిత్రం రూపొందుతున్నట్టు తెలుస్తోంది. అంజలి, సముద్రఖని, ఎస్‌.జె.సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, నవీన్‌చంద్ర తదితరులు ఇందులో నటిస్తున్నారు. కథ: కార్తీక్‌ సుబ్బరాజ్‌, ఛాయాగ్రహణం: ఎస్‌.తిరుణావుక్కరసు, సంగీతం: తమన్‌, సంభాషణలు: సాయిమాధవ్‌ బుర్రా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని