Thangalaan: కొత్త అవతారం... విక్రమ్‌ కష్టం

సినిమాలలో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు కథానాయకుడు విక్రమ్‌. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘తంగలాన్‌’.

Updated : 18 Apr 2023 11:25 IST

సినిమాలలో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు కథానాయకుడు విక్రమ్‌. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘తంగలాన్‌’. పా.రంజిత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్‌లోని కార్మికుల జీవితాల చుట్టూ జరిగే వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. విక్రమ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా మేకింగ్‌ వీడియోను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. ఇందులో కొత్త అవతారంలో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు విక్రమ్‌. ఆయన తన పాత్ర కోసం ఏవిధంగా కష్టపడుతున్నాడో ఇందులో చూపించారు. ఈ సినిమాలో మాళవిక మోహనన్‌, పార్వతి, డేనియల్‌ కాల్లాగిరోన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు విక్రమ్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని