Devara: ఎర్ర సముద్రంలో.. ‘దేవర’ ఊచకోత

‘దేవర’గా ఈ వేసవి బరిలో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు కథానాయకుడు ఎన్టీఆర్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి హిట్‌ తర్వాత ఆయన నుంచి రానున్న చిత్రమిది. కొరటాల శివ రూపొందిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమాని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Updated : 09 Jan 2024 07:08 IST

‘దేవర’గా ఈ వేసవి బరిలో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు కథానాయకుడు ఎన్టీఆర్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి హిట్‌ తర్వాత ఆయన నుంచి రానున్న చిత్రమిది. కొరటాల శివ రూపొందిస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమాని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్‌ కథానాయిక. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. సోమవారం ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. 80 సెకన్ల నిడివితో ఉన్న ఈ ప్రచార చిత్రంలో ఎన్టీఆర్‌ చేసిన ఊచకోత కనిపించింది. కారు మబ్బులు కమ్ముకొని అల్లకల్లోలంగా ఉన్న సముద్రం.. దాంట్లో ఏదో సరకుతో నిండి ఉన్న ఓ భారీ ఓడ.. దానిపై ఓ ముష్కర మూక దాడి చేయడం.. వాళ్లను ఎన్టీఆర్‌ చీల్చి చెండాడటం.. ఇలా టీజర్‌ ఆద్యంతం ఆసక్తి రేకెత్తిస్తూ సాగింది. ‘‘ఈ సముద్రం సేపల్ని కంటే, కత్తుల్ని.. నెత్తుర్నే ఎక్కువ చూసుండాది. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు’’ అంటూ టీజర్‌ ఆఖర్లో ఎన్టీఆర్‌ ఓ శక్తిమంతమైన డైలాగ్‌ వినిపించారు. ఈ ప్రచార చిత్రానికి అనిరుధ్‌ అందించిన నేపథ్య సంగీతం.. సాబు సిరిల్‌ ప్రొడక్షన్‌ డిజైనింగ్‌ అదనపు ఆకర్షణగా నిలిచాయి. చిత్రీకరణ దశలో ఉన్న ఈ మాస్‌ యాక్షన్‌ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుండగా.. తొలి భాగం ‘దేవర పార్ట్‌-1’ పేరుతో ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని