ఆదరణ ఆనందాన్నిస్తోంది

‘ఈగల్‌’ సినిమాతో ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్నారు రవితేజ. కార్తీక్‌ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు.

Published : 12 Feb 2024 05:00 IST

గల్‌’ సినిమాతో ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్నారు రవితేజ. కార్తీక్‌ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. కావ్య థాపర్‌, అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికలు. ఈ సినిమా ఇటీవల విడుదలైన నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆదివారం సక్సెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ చాలా ఆనందాన్నిస్తోంది. ముఖ్యంగా నా మేకోవర్‌కు చాలా ప్రశంసలొస్తున్నాయి’’ అన్నారు. ‘‘దర్శకుడు కార్తీక్‌ ఈ సినిమాని కష్టపడి.. ఒక ప్యాషన్‌తో చేశాడు. ఎవరికైనా నచ్చకపోతే వదిలేయండి. అంతేకానీ పిచ్చిగా ట్రోల్స్‌ చేస్తూ ఎద్దేవా చేయకండి. సినీ పాత్రికేయులు కూడా చిత్రసీమలో భాగమే. మనం ఒకరిపై ఒకరు రాళ్లు వేసుకోవడం సరికాదు’’ అన్నారు దర్శకుడు హరీశ్‌ శంకర్‌. దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని మాట్లాడుతూ.. ‘‘ఓ యాక్షన్‌ సినిమాకి మంచి సందేశం జత చేసి తీయాలన్నది నా కోరిక. అది రవితేజ లాంటి ఇమేజ్‌ ఉన్న స్టార్‌తో చేసినప్పుడే కుదురుతుంది. అది ఈ చిత్రంతో నెరవేరింది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో టీజీ విశ్వప్రసాద్‌, బీవీఎస్‌ రవి, అవసరాల శ్రీనివాస్‌, కావ్య థాపర్‌, ప్రణీత పట్నాయక్‌, మణిబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని