చరణ్‌ సరసన జాన్వీ

రామ్‌చరణ్‌, జాన్వీ కపూర్‌.. ఈ జోడీ కొన్నేళ్లుగా ప్రేక్షకుల్ని ఊరిస్తోంది. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రీమేక్‌ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ఈ జోడీ ముచ్చట వినిపించేది.

Updated : 20 Feb 2024 06:24 IST

రామ్‌చరణ్‌, జాన్వీ కపూర్‌.. ఈ జోడీ కొన్నేళ్లుగా ప్రేక్షకుల్ని ఊరిస్తోంది. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రీమేక్‌ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ఈ జోడీ ముచ్చట వినిపించేది. రామ్‌చరణ్‌ నటించిన మరికొన్ని ఇతర ప్రాజెక్టుల విషయంలోనూ జాన్వీ కపూర్‌ పేరు వినిపించింది. ఎట్టకేలకి ఈ ఇద్దరూ కలిసి నటించే సమయం వచ్చేసింది. రామ్‌చరణ్‌ 16వ చిత్రంలో ఆయనతో జట్టు కట్టేది జాన్వీనే. ఈ విషయాన్ని జాన్వీ తండ్రి బోనీకపూర్‌ స్వయంగా వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘‘ఎన్టీఆర్‌తో కలిసి ‘దేవర’లో నటిస్తున్న జాన్వీ, త్వరలోనే రామ్‌చరణ్‌తోనూ జట్టు కడుతోంది. సూర్యతోనూ ఓ సినిమా చేయడానికి సిద్ధంగా ఉంది. నా భార్య శ్రీదేవి పలు భాషల్లో నటించారు. అలా నా కుమార్తె కూడా నటిస్తుంది’’ అన్నారు. రామ్‌చరణ్‌ 16వ చిత్రం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే చిత్రమిది. క్రీడాకారుడిగా రామ్‌చరణ్‌ తెరపై సందడి చేయనున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకి ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని