ఆలస్యమైనా... ‘క్వీన్‌2’ వస్తుంది

పెళ్లి ఆగిపోయిన తర్వాత ఒత్తిడికి గురైన పంజాబీ యువతి రాణి మెహరా..వదులుకున్న స్వేచ్ఛను, ఆనందాన్ని తిరిగి పొందేందుకు విదేశాలకు పయనం అవుతుంది. మరి ఆమె ఒంటరిగా జీవితాన్ని ఎలా గడుపుతుందనే కథనంతో వికాస్‌ బహ్ల్‌ తెరకెక్కించిన చిత్రం ‘క్వీన్‌’. కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో 2014లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Published : 24 Feb 2024 02:37 IST

పెళ్లి ఆగిపోయిన తర్వాత ఒత్తిడికి గురైన పంజాబీ యువతి రాణి మెహరా..వదులుకున్న స్వేచ్ఛను, ఆనందాన్ని తిరిగి పొందేందుకు విదేశాలకు పయనం అవుతుంది. మరి ఆమె ఒంటరిగా జీవితాన్ని ఎలా గడుపుతుందనే కథనంతో వికాస్‌ బహ్ల్‌ తెరకెక్కించిన చిత్రం ‘క్వీన్‌’. కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో 2014లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి కొనసాగింపు ఉన్నట్లు ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వికాస్‌ ఆ వార్తలకు తెర దించారు. ‘పదేళ్ల కిందట వచ్చిన ఈ సినిమా సీక్వెల్‌ గురించి ప్రేక్షకులు అడుగుతుంటే నిన్ననే విడుదలైనట్టు అనిపిస్తోంది. ‘క్వీన్‌’కి కొనసాగింపు ఉంది. కథ సిద్ధంగా ఉంది. కొంచెం ఆలస్యమైన కానీ సీక్వెల్‌ మాత్రం తప్పక అభిమానులను అలరిస్తోంది’ అంటూ తెలిపారు. ప్రస్తుతం కంగన నటించిన ‘ఎమర్జెన్సీ’, వికాస్‌ బహ్ల్‌ దర్శకత్వం వహించిన ‘షైతాన్‌’ విడుదలకు సన్నద్ధం అవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని