తమ్ముడి కోసం అక్క పోరాటం

‘‘సోదరుడికి రాఖీ కట్టడం అంటే అతనికి ఎలాంటి హానీ జరగకుండా కాపాడుకుంటానని చేసే ప్రమాణం. నిన్ను కాపాడుకోవడం నా కర్తవ్యం’’ అంటూ తన తమ్ముడి కోసం పోరాడుతుంది ఓ సోదరి. మరి ఆమె ఎవరు..? తన తమ్ముడికి ఏ హాని పొంచి ఉంది? అనేది తెలియాలంటే ‘జిగ్రా’ చూడాల్సిందే.

Published : 24 Feb 2024 02:16 IST

‘‘సోదరుడికి రాఖీ కట్టడం అంటే అతనికి ఎలాంటి హానీ జరగకుండా కాపాడుకుంటానని చేసే ప్రమాణం. నిన్ను కాపాడుకోవడం నా కర్తవ్యం’’ అంటూ తన తమ్ముడి కోసం పోరాడుతుంది ఓ సోదరి. మరి ఆమె ఎవరు..? తన తమ్ముడికి ఏ హాని పొంచి ఉంది? అనేది తెలియాలంటే ‘జిగ్రా’ చూడాల్సిందే. బాలీవుడ్‌ నాయికా అలియా భట్‌ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రమిది. వాసన్‌ బాలా తెరకెక్కిస్తున్నారు. అలియా, కరణ్‌ జోహార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు తెలుపుతూ.. సామాజిక మాధ్యమాల వేదికగా కొన్ని ఫొటోలను పంచుకుంది అలియా. ‘ఆర్చీస్‌’ చిత్రంలో కీలక పాత్ర పోషించిన వేదాంగ్‌ రైనా.. ఇందులో అలియాకి సోదరుడిగా నటిస్తున్నారు. అక్కతమ్ముళ్ల మధ్య అనుబంధంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సెప్టెంబరు 27న ఈ సినిమా విడుదల కానున్నట్లు తెలిపింది చిత్రబృందం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని