దుబాయ్‌లో గామా పురస్కారాల వేడుక

గామా తెలుగు మూవీ అవార్డ్స్‌ 4వ ఎడిషన్‌ వేడుకలు మార్చి 3న దుబాయ్‌లో జరగనున్నాయి. దీనికి సంబంధించిన కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమం హైదరాబాద్‌లో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జ్యూరీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న సంగీత దర్శకుడు కోటి, జ్యూరీ సభ్యులు వి.ఎన్‌ ఆదిత్య, రఘు కుంచె, డీవీవీ దానయ్య, డింపుల్‌ హయాతి, సాయి రాజేశ్‌ తదితరులు హాజరై ఈ వేడుకకు సంబంధించిన ట్రోఫీని లాంచ్‌ చేశారు.

Published : 24 Feb 2024 02:39 IST

గామా తెలుగు మూవీ అవార్డ్స్‌ 4వ ఎడిషన్‌ వేడుకలు మార్చి 3న దుబాయ్‌లో జరగనున్నాయి. దీనికి సంబంధించిన కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమం హైదరాబాద్‌లో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జ్యూరీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న సంగీత దర్శకుడు కోటి, జ్యూరీ సభ్యులు వి.ఎన్‌ ఆదిత్య, రఘు కుంచె, డీవీవీ దానయ్య, డింపుల్‌ హయాతి, సాయి రాజేశ్‌ తదితరులు హాజరై ఈ వేడుకకు సంబంధించిన ట్రోఫీని లాంచ్‌ చేశారు. అనంతరం సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.. ‘‘ఈ వేడుకను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. 2021, 2022, 2023లో విడుదలైన చిత్రాల నుంచి ఉత్తమ నటుడు - నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గాయకుడు.. ఇలా పలు విభాగాల్లో అవార్డులు అందజేయనున్నాం’’ అన్నారు. ‘‘వేల మంది తెలుగు, తమిళ, మలయాళ సినీ ప్రేమికుల మధ్యలో దుబాయ్‌లో ఈ వేడుకలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ సహా టాలీవుడ్‌ ప్రముఖులందరినీ ఈ వేడుకకు ఆహ్వానించాం’’ అన్నారు గామా అవార్డ్స్‌ సీఈవో సౌరభ్‌. ఈ అవార్డ్స్‌ వేడుకలో ఆస్కార్‌ విజేతలు కీరవాణి, చంద్రబోస్‌లను ప్రత్యేకంగా గామా గౌరవ్‌ సత్కార్‌తో సన్మానించనున్నట్లు దర్శకుడు ప్రసన్న పాలంకి తెలియజేశారు. అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మృతిగా ‘గామా ఎస్బీబీ గోల్డెన్‌ వాయిస్‌ అవార్డు’ను గాయకుడు మనోకి అందివ్వనున్నామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని