ముగ్గురూ ముగ్గురే... ఎక్కడా తగ్గరే

తెరపై ముగ్గురు అందాల తారలు సందడి చేస్తే ఎలా ఉంటుందో చూపించడానికి ‘ది క్రూ’ చిత్రబృందం సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ అగ్రకథానాయికలు టబు, కృతి సనన్‌, కరీనా కపూర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కామెడీ నేపథ్యంలో రాజేష్‌ కృష్ణన్‌ తెరకెక్కిస్తున్నారు.

Published : 24 Feb 2024 02:42 IST

తెరపై ముగ్గురు అందాల తారలు సందడి చేస్తే ఎలా ఉంటుందో చూపించడానికి ‘ది క్రూ’ చిత్రబృందం సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ అగ్రకథానాయికలు టబు, కృతి సనన్‌, కరీనా కపూర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కామెడీ నేపథ్యంలో రాజేష్‌ కృష్ణన్‌ తెరకెక్కిస్తున్నారు. ‘మా విమానంలోకి మీ అందరికీ స్వాగతం’ అంటూ ఇటీవలే ఇందులో ఈ అందాల భామలు పోషిస్తున్న పాత్రల గురించి తెలిపింది చిత్రబృందం. తాజాగా ఈ సినిమాలోని ఈ ముగ్గురు నాయికల ఫస్ట్‌లుక్‌లను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది. ‘ఒకరు అబద్ధాలతో, మరొకరు దొంగలించడానికి, నకిలీ వేషాలతో ఇంకొకరు రెడీగా ఉన్నారు. మరి మా సిబ్బందితో కలిసి ప్రయాణించడానికి మీరు సిద్ధమేనా?’’ అంటూ వ్యాఖ్యల్ని జోడించింది. ఇందులో పదునైనా చూపులతో ఎయిర్‌హోస్టెస్‌గా కనిపిస్తూ సినీప్రియులను ఆకట్టుకుంటున్నారు ఈ ముగ్గురు భామలు. దిల్జీత్‌ దోసాంజ్‌, కపిల్‌ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తున్న ముగ్గురు మహిళల జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. ఏక్తా కపూర్‌, రియా కపూర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 29న రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని