Cinema News: నాయకా.. సెట్లో ఎప్పుడు నీ రాక!

అభిమాన కథానాయకుల నుంచి కొత్త కబురు వినిపించిందంటే సినీప్రియుల్లో ఓ నూతనోత్సాహం కనిపిస్తుంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన సినీతారలు ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో కబురు వినిపించే ప్రయత్నం చేస్తుంటారు.

Published : 24 Feb 2024 02:47 IST

నెలలు గడుస్తున్నా కొత్త కబురు వినిపించని యువ హీరోలు

అభిమాన కథానాయకుల నుంచి కొత్త కబురు వినిపించిందంటే సినీప్రియుల్లో ఓ నూతనోత్సాహం కనిపిస్తుంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన సినీతారలు ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో కబురు వినిపించే ప్రయత్నం చేస్తుంటారు. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి అగ్ర కథానాయకుల మొదలు.. నాని, నాగచైతన్య తదితర యువహీరోల వరకు కొత్త చిత్రాల విషయంలో ఇప్పటికే స్పష్టత ఇచ్చేశారు. ఇప్పుడు వీళ్ల సినిమాలు ఓ వైపు సెట్స్‌పై ముస్తాబవుతుండగానే.. మరోవైపు కొత్త కలయికల కబుర్లు ప్రచారంలో వినిపిస్తూ ప్రేక్షకుల్ని ఊరిస్తున్నాయి. అయితే ఇప్పటికీ తెలుగులో పలువురు హీరోల సినిమాల విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. దీంతో వాళ్ల కొత్త చిత్ర విశేషాలేంటి? ఎప్పట్నుంచి సెట్స్‌లోకి అడుగు పెడతారన్నది ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.  

వైవిధ్యభరితమైన కథలతో వినోదాలు పంచుతూ సినీప్రియుల్ని మెప్పించిన కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్‌. ఆయన గతేడాది ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో బాక్సాఫీస్‌ ముందు జోరు చూపించిన సంగతి తెలిసిందే. అయితే దీని తర్వాత ఆయన నుంచి రానున్న చిత్రమేదన్నది ఇంకా తేలలేదు. నిజానికి తను గతేడాది చివర్లో ఓ కొత్త కబురు వినిపించారు. సంపత్‌ నంది దర్శకత్వంలో ‘గాంజా శంకర్‌’ అనే చిత్రాన్ని చేస్తున్నట్లు ప్రకటించినా.. దాని పురోగతి ఏంటన్నది ఇంత వరకు తెలియలేదు. ప్రస్తుతానికైతే తేజు కోసం దర్శకుడు కిషోర్‌ తిరుమల ‘చిత్రలహరి 2’ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. కథానాయకుడు అఖిల్‌ తదుపరి చిత్ర విషయంలోనూ ఇదే సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఆయన గతేడాది ‘ఏజెంట్‌’తో బాక్సాఫీస్‌ ముందు సందడి చేయగా.. అది చేదు ఫలితాన్ని ఇచ్చింది. దీంతో తను కథల ఎంపికలో పునరాలోచనలో పడ్డట్లు తెలిసింది. అందుకే ఆయన నుంచి సినిమా వచ్చి ఏడాది పూర్తి కావొస్తున్నా.. తదుపరి చిత్రంపై స్పష్టత రాలేదు. యూవీ క్రియేషన్స్‌లో అనిల్‌ కుమార్‌ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేయనున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ, అదెప్పుడు కార్యరూపం దాల్చుతుందన్నది తేలలేదు.

ఆచితూచి అడుగులు

‘ఉప్పెన’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో మెరిసిన కథానాయకుడు వైష్ణవ్‌ తేజ్‌. ఆయన దాని తర్వాత ‘కొండపొలం’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నా.. ‘రంగ రంగ వైభవంగా’, ‘ఆదికేశవ’ సినిమాలతో వరుసగా నిరుత్సాహపరిచారు. దీంతో ప్రస్తుతం తను కూడా తదుపరి చిత్ర విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇంత వరకు వైష్ణవ్‌ నుంచి మరో కొత్త కబురు వినపడలేదు. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’, ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ సినిమాలతో వరుస విజయాలందుకొని జోరు మీదున్నారు నవీన్‌ పొలిశెట్టి. ఆయన ‘అనగనగా రాజు’ అనే ఓ సినిమా చేస్తున్నట్లు గతంలో ఓ ప్రకటన వెలువడింది. కానీ, ఆ తర్వాత దానికి సంబంధించి మరే విశేషాలు బయటకు రాలేదు. ప్రస్తుతానికైతే తన సినిమాలన్నీ స్క్రిప్ట్‌ దశలోనే ఉన్నాయని.. మంచి నాణ్యమైన కొత్తదనం నిండిన చిత్రాలను అందించడానికి సమయం పడుతుందని.. అంత వరకు ఓపికగా ఎదురు చూడాలని నవీన్‌ తాజాగా సామాజిక మాధ్యమాల వేదికగా ఓ నెటిజన్‌కు బదులిచ్చారు. సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అతిథి పాత్రలో..

ఓవైపు కథానాయకుడిగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు మంచి పాత్రలు దొరికినప్పుడల్లా ఇతర హీరోల చిత్రాల్లోనూ సందడి చేస్తుంటారు రానా. ఆయన నుంచి గతేడాది ఒక్క చిత్రం బయటకు రాలేదు. తేజ దర్శకత్వంలో ‘రాక్షస రాజు’ అనే చిత్రం చేయనున్నట్లు ఆమధ్య ప్రకటన వచ్చినా.. అదింత వరకు పట్టాలెక్కలేదు. ఇక రానా కలల ప్రాజెక్ట్‌ ‘హిరణ్య కశ్యప’పై గతేడాది కామికాన్‌ వేడుకలో ప్రకటన వచ్చినా.. అదీ కార్యరూపం దాల్చలేదు. ఆయన ప్రస్తుతానికైతే రజనీకాంత్‌ ‘వేట్టయాన్‌’ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు