నిజాయతీగల పోలీసు అధికారి

ప్రభాస్‌ సినిమా ‘స్పిరిట్‌’పై  మరోసారి స్పష్టతనిచ్చారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. ‘యానిమల్‌’తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ఆయన, తన  తదుపరి సినిమాగా ప్రభాస్‌తో ‘స్పిరిట్‌’  చేస్తున్నారు.

Published : 01 Mar 2024 01:27 IST

ప్రభాస్‌ సినిమా ‘స్పిరిట్‌’పై  మరోసారి స్పష్టతనిచ్చారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. ‘యానిమల్‌’తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ఆయన, తన  తదుపరి సినిమాగా ప్రభాస్‌తో ‘స్పిరిట్‌’  చేస్తున్నారు. ఇందులో   నిజాయతీగల ఓ పోలీసు అధికారి పాత్రలో  ప్రభాస్‌ కనిపిస్తారని చెప్పారు సందీప్‌ వంగా. ఈ సినిమా కథ, పాత్రల గురించి భిన్న రకాలుగా ప్రచారం సాగుతుండగా వాటన్నిటికీ తెరదించారు. ఈ యేడాది చివర్లో చిత్రీకరణని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.  ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు కొనసాగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని