జాన్వీ... ఊ అన్నారా?

‘ప్రత్యేక’ మెరుపులతో జాన్వీ తెరపై సందడి చేయనుందా? ఆమె రూపంలో ‘పుష్ప2’కి అదనపు ఆకర్షణ తోడవుతోందా? అధికారిక సమాచారమైతే లేదు కానీ...

Published : 01 Mar 2024 01:36 IST

ప్రత్యేక’ మెరుపులతో జాన్వీ తెరపై సందడి చేయనుందా? ఆమె రూపంలో ‘పుష్ప2’కి అదనపు ఆకర్షణ తోడవుతోందా? అధికారిక సమాచారమైతే లేదు కానీ... చిత్రసీమలో ఈ విషయమే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. ‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా మావా...’ అంటూ ప్రత్యేక గీతంతో సమంత సృష్టించిన సందడి అంతా ఇంతా కాదు. ‘పుష్ప 2’లో కూడా ఆ తరహాలోనే ఓ ప్రత్యేక గీతం ఉంటుందని సమాచారం. ఆ పాటలో ఎవరు నటిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇదివరకూ కొందరు బాలీవుడ్‌ భామల పేర్లు వినిపించాయి. తాజాగా జాన్వీ కపూర్‌ పేరు బలంగా వినిపిస్తోంది. మరి ఆమె ప్రత్యేక గీతంలో ఆడిపాడటానికి ఊ అన్నారా లేదా అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. జాన్వీ ప్రస్తుతం తెలుగు ప్రాజెక్టులపైనే ప్రముఖంగా దృష్టి సారించింది. ఎన్టీఆర్‌తో కలిసి ‘దేవర’లో నటిస్తున్న ఆమె, తదుపరి రామ్‌చరణ్‌తో జట్టు కట్టనుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా ఈ వేసవిలోనే ప్రారంభం కానుంది. ‘పుష్ప 2’ పాటకీ ఆమె సంతకం చేసిందంటే వరుసగా అగ్ర కథానాయకులు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌లతో కలిసి నటించిన కథానాయిక అవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు