డైమండ్‌ బజార్‌లో మెరిసిన తారలు

‘హీరామండీ: ది డైమండ్‌ బజార్‌’ ద్వారం తెరిచే సమయం వచ్చేసిందని అంటోంది ఆ సిరీస్‌ బృందం. విభు పూరి, మితాక్షర కుమార్‌తో కలిసి ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ఆ సిరీస్‌లో అగ్రతారలు మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితీరావ్‌ హైదరీ, రిచా చద్ధా,

Published : 01 Mar 2024 01:44 IST

హీరామండీ: ది డైమండ్‌ బజార్‌’ ద్వారం తెరిచే సమయం వచ్చేసిందని అంటోంది ఆ సిరీస్‌ బృందం. విభు పూరి, మితాక్షర కుమార్‌తో కలిసి ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ఆ సిరీస్‌లో అగ్రతారలు మనీషా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితీరావ్‌ హైదరీ, రిచా చద్ధా, షర్మిన్‌ సెగల్‌, సంజీదా షేక్‌ కీలక పాత్రల్లో మెరవనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ సిరీస్‌లో వారు పోషించిన పాత్రలను పరిచయం చేస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టర్లను పంచుకుంది సిరీస్‌ బృందం. ‘మెరిసే ప్రతి రత్నానికి ఒక గతం ఉంటుంది. ఫరీదాన్‌కి కూడా ఒక రహస్య గతం ఉంది’ అంటూ సోనాక్షిని, ‘కళ్లకు అందంగా కనిపిస్తున్నా లజ్జో తన మనసులో ఒక విషాధగాథను దాచిపెట్టుకుంది’ అంటూ రిచాని, సంజీదాను ‘అందరూ ప్రేమ..స్వేచ్‌ కోసం పోరాడితే వహీదా మాత్రం భిన్నంగా శక్తి కోసం ఆరాటపడుతుంది’, ‘ప్రేమించే స్వేచ్ఛకోసం తపన పడే అలంజేబ్‌’గా షర్మిల పాత్రను, ‘తన కోసమే కాదు, స్వేచ్ఛకోసం కూడా పోరాడే బిబ్జోజాన్‌’గా అదితిని, ‘వజ్రాలతో నిండిన బజార్‌లో అత్యంత ప్రకాశవంతంగా మెరిసే మల్లికాజాన్‌’గా మనీషా కోయిరాల పాత్రలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆభరణాలు ధరించి రాజసంగా కనిపిస్తున్న ఆ ఆరుగురు అందర్ని ఆకట్టుకుంటున్నారు. మరి వారి జీవిత కథను తెలుసుకోవాలంటే కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న ఈ సిరీస్‌ను చూడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని