పట్టణంలో ‘కలియుగం’

విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్‌ జంటగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. చిత్ర శుక్లా కీలక పాత్రని పోషించారు. రమాకాంత్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డా.కందుల చంద్ర ఓబుల్‌ రెడ్డి, జి.మహేశ్వర్‌ రెడ్డి, కాటం రమేశ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Published : 02 Mar 2024 01:13 IST

విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్‌ జంటగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. చిత్ర శుక్లా కీలక పాత్రని పోషించారు. రమాకాంత్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డా.కందుల చంద్ర ఓబుల్‌ రెడ్డి, జి.మహేశ్వర్‌ రెడ్డి, కాటం రమేశ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నెల 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. హైదరాబాద్‌లో ఈ సినిమా టీజర్‌ విడుదల వేడుకని నిర్వహించారు. ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌, దర్శకులు త్రినాథరావు నక్కిన, నీలకంఠ, నిర్మాతలు దామోదర్‌ ప్రసాద్‌, డి.ఎస్‌.రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కథానాయకుడు మాట్లాడుతూ ‘‘తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో భావోద్వేగాలతోపాటు, థ్రిల్లింగ్‌ అంశాల్ని జోడించి తెరకెక్కించిన చిత్రమిది. అందరికీ నచ్చుతుంది. పరిశ్రమలో నాకు ఎంతోమంది అండగా నిలిచారు. కొత్తతరాన్ని ప్రోత్సహిస్తేనే మరింత మంది పరిశ్రమకి వస్తార’’న్నారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని