రాణి, రిషుల ప్రేమ ముగిసేనా

మర్డర్‌ మిస్టరీగా ‘హసీన్‌ దిల్‌రుబా’తో ప్రేక్షకులను మెప్పించిన తాప్సీ ఇప్పుడు దానికి కొనసాగింపుగా  ‘ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా’తో ప్రేక్షకులను అలరించేందుకు రానుంది. ఆమె..విక్రాంత్‌ మాస్సే ప్రధాన పాత్రలో జయప్రద దేశాయ్‌ తెరకెక్కిస్తున్న చిత్రమది.

Published : 02 Mar 2024 01:14 IST

ర్డర్‌ మిస్టరీగా ‘హసీన్‌ దిల్‌రుబా’తో ప్రేక్షకులను మెప్పించిన తాప్సీ ఇప్పుడు దానికి కొనసాగింపుగా  ‘ఫిర్‌ ఆయీ హసీన్‌ దిల్‌రుబా’తో ప్రేక్షకులను అలరించేందుకు రానుంది. ఆమె..విక్రాంత్‌ మాస్సే ప్రధాన పాత్రలో జయప్రద దేశాయ్‌ తెరకెక్కిస్తున్న చిత్రమది. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసింది చిత్రబృందం. ‘రాణి, రిషుల జీవితంలో ప్రేమ, పిచ్చి ఇంకా మిగిలే ఉన్నాయి. ఇలాంటి ప్రేమకథకి ఓ అందమైన ముగింపు ఉంటుందా?’ అంటూ వ్యాఖ్యల్ని జోడించింది. ‘ఇది గొప్ప క్లైమాక్స్‌!’ అంటూ పోలీసు పాత్రలో ఆదిత్య శ్రీవాత్సవ చెప్పిన వ్యాఖ్యతో మొదలైన టీజర్‌ ‘ఏక్‌ హసీనా థీ ఏక్‌ దీవానా థా’ అనే నేపథ్య గీతంతో ఆకట్టుకుంటుంది. సన్నీ కౌశల్‌, జిమ్మీ షెర్గిల్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని