సోలో బాయ్‌ సందడి

బిగ్‌బాస్‌ ఫేం గౌతమ్‌కృష్ణ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘సోలో బాయ్‌’.

Published : 15 Apr 2024 00:19 IST

బిగ్‌బాస్‌ ఫేం గౌతమ్‌కృష్ణ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘సోలో బాయ్‌’. శ్వేతా అవస్థి కథానాయిక. పి.నవీన్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సెవెన్‌హిల్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సతీష్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. త్వరలోనే టీజర్‌ని విడుదల చేయనున్నట్టు సినీవర్గాలు తెలిపాయి. గౌతమ్‌కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో చిత్రబృందం వేడుకని నిర్వహించింది. ఈ సందర్భంగా గౌతమ్‌కృష్ణ మాట్లాడుతూ ‘‘దర్శకుడు నవీన్‌ గురించి చెప్పగానే కథ విని ఓకే చేశారు నిర్మాత సతీష్‌ కుమార్‌. ఈ సినిమాతో సోలో బాయ్‌గా ప్రేక్షకులకు గుర్తుండిపోతా. ఎక్కడా రాజీ పడకుండా సినిమాని తీర్చిదిద్దారు దర్శకుడు. అనిత చౌదరి సహా పలువురు సీనియర్‌ నటులతో కలిసి నటించడం మంచి అనుభవం’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘మంచి సినిమాగా ప్రేక్షకుల మనసుల్ని గెలుస్తుంది ‘సోలోబాయ్‌’. గౌతమ్‌ నాకు సోదరుడితో సమానం. ప్రతి పాత్ర గుర్తుండిపోతుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో అనిత చౌదరి, మనోజ్‌, భద్రం, పింగ్‌పాంగ్‌ సూర్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని