సేనాపతి పునరుత్థానం

ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ సేనాపతి రెడ్‌ అలర్ట్‌ని ప్రకటించినట్టే! ఏమాత్రం సహించకుండా విరుచుకుపడే నిఖార్సయిన భారతీయుడి కొత్త అవతారాన్ని చూడాలంటే జూన్‌ వరకు ఎదురు చూడాల్సిందే.

Published : 15 Apr 2024 00:26 IST

క్కడ అన్యాయం జరిగినా అక్కడ సేనాపతి రెడ్‌ అలర్ట్‌ని ప్రకటించినట్టే! ఏమాత్రం సహించకుండా విరుచుకుపడే నిఖార్సయిన భారతీయుడి కొత్త అవతారాన్ని చూడాలంటే జూన్‌ వరకు ఎదురు చూడాల్సిందే. అగ్ర హీరో కమల్‌హాసన్‌ కథానాయకుడిగా.. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భారతీయుడు 2’ శరవేగంగా ముస్తాబవుతోంది. ప్రస్తుతం తుది దశ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని సినీవర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. గతంలో వచ్చిన ‘భారతీయుడు’కి కొనసాగింపుగా తెరకెక్కుతున్న చిత్రమిది. సిద్ధార్థ్‌, కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, ప్రియా భవానీ శంకర్‌, ఎస్‌.జె.సూర్య, బాబీసింహా కీలక పాత్రలు పోషించారు. రెడ్‌ జెయింట్‌ మూవీస్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు. జూన్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సేనాపతి పునరుత్థానం అంటూ చిత్రబృందం ఆదివారం ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని