ఇది నా అదృష్టం: అమితాబ్‌

ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్‌ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్‌ మంగేష్కర్‌ పురస్కారాన్ని బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు.

Published : 25 Apr 2024 00:58 IST

ముంబయి: ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్‌ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్‌ మంగేష్కర్‌ పురస్కారాన్ని బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. దీనానాథ్‌ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ఉషా మంగేష్కర్‌ చేతుల మీదుగా అమితాబ్‌ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లతా దీనానాథ్‌ మంగేష్కర్‌ పురస్కారాన్ని స్వీకరించడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ‘‘ఇలాంటి పురస్కారాన్ని స్వీకరించేందుకు నేను అర్హుడినని ఏనాడూ భావించలేదు. హృదయనాథ్‌ పదేపదే కోరడంతో నేను ఇక్కడకు వచ్చాను. గతేడాది కూడా నన్ను అవార్డు ప్రదానోత్సవానికి ఆహ్వానించారు’’ అని అమితాబ్‌ చెప్పారు.

భారతీయ సంగీత రంగానికి అందించిన సేవలకుగాను ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ను ఇదే కార్యక్రమంలో మాస్టర్‌ దీనానాథ్‌ మంగేష్కర్‌ పురస్కారంతో సత్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని