యాక్షన్‌ రుచి చూపించే.. బేబీ జాన్‌

‘బేబీ జాన్‌’గా ప్రత్యర్థులకు తన యాక్షన్‌ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్‌ కథానాయకుడు వరుణ్‌ ధావన్‌. కాలీస్‌ దర్శకత్వంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్‌’.

Published : 25 Apr 2024 01:01 IST

‘బేబీ జాన్‌’గా ప్రత్యర్థులకు తన యాక్షన్‌ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్‌ కథానాయకుడు వరుణ్‌ ధావన్‌. కాలీస్‌ దర్శకత్వంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్‌’. కీర్తి సురేశ్‌ కథానాయిక. వామికా గబ్బీ, జాకీష్రాఫ్‌, రాజ్‌పాల్‌ యాదవ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వరుణ్‌ పుట్టినరోజు సందర్భంగా బుధవారం సినిమాలోని ఆయన కొత్త లుక్‌ని సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేసింది చిత్రబృందం. ‘మరిచిపోలేని సరికొత్త అనుభవాన్ని అందించేందుకు మీ ముందుకు ‘బేబీ జాన్‌’ త్వరలో వస్తున్నాడు’ అనే వ్యాఖ్యల్ని జోడించింది. పొడవాటి జుట్టు, కండలు తిరిగిన దేహం, చురుకైన చూపులతో వర్షంలో తడుస్తున్న వరుణ్‌ కొత్త పోస్టర్‌ అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మే 31న విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు