కనులెందుకో కలిసేనులే...

సుధీర్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్‌.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్‌.జి నాయుడు నిర్మాత.

Published : 25 Apr 2024 01:05 IST

సుధీర్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్‌.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్‌.జి నాయుడు నిర్మాత. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలోని ‘కనులెందుకో కలిసేనులే...’ అంటూ సాగే పాటని బుధవారం విడుదల చేశారు. చైతన్‌ భరద్వాజ్‌ స్వరపరిచిన ఈ పాటని ఆయనతో కలిసి నిఖితా శ్రీవల్లి ఆలపించారు. వెంగీ సాహిత్యం సమకూర్చారు. ‘‘1989లో కుప్పంలో జరిగిన ఓ సంఘటన స్ఫూర్తితో రూపొందుతున్న చిత్రమిది. సుధీర్‌బాబు ఆ ప్రాంతం యాసతో సంభాషణలు చెప్పారు. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ సినిమా ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచుతుంది. మంచి మెలోడీతో సాగే ‘కనులెందుకో...’ పాటలో సుధీర్‌బాబు, మాళవిక మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. విజువల్స్‌ ఆకట్టుకుంటాయి. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామ’’ని సినీవర్గాలు తెలిపాయి. సునీల్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అరవింద్‌ విశ్వనాథన్‌, కూర్పు: రవితేజ గిరిజాల.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని