రామోజీ ఫిల్మ్‌సిటీలో తమ్ముడు

నితిన్‌ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మాతలు.

Published : 25 Apr 2024 01:11 IST

నితిన్‌ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మాతలు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. ప్రొడక్షన్‌ డిజైనర్‌ మునిశేఖర్‌ సారథ్యంలో తీర్చిదిద్దిన ప్రత్యేకమైన సెట్‌లో... ఓ భారీ  పోరాట ఘట్టాన్ని  తెరకెక్కిస్తున్నారు. యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ విక్రమ్‌ మోర్‌ నేతృత్వంలో ఈ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. వారం రోజులపాటు చిత్రీకరించే ఈ పోరాట ఘట్టం చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని సినీవర్గాలు స్పష్టం చేశాయి. తమ్ముడు, అక్క బంధం చుట్టూ సాగే కథ ఇది. సోదరి పాత్రలో సీనియర్‌ కథానాయిక నటిస్తున్నారు. ‘వకీల్‌సాబ్‌’ తర్వాత శ్రీరామ్‌ వేణు తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌, ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని