సర్దార్‌ 2 సన్నాహాలు

కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్‌’. పీఎస్‌ మిత్రన్‌ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్‌ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే.

Published : 25 Apr 2024 01:12 IST

కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్‌’. పీఎస్‌ మిత్రన్‌ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్‌ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా చిత్రీకరణను జూన్‌లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘రాబోయే ప్రాజెక్టులో కార్తి మరింత భిన్నంగా కనిపిస్తారు. అందుకు అనుగుణంగా స్క్రిప్టులో చాలా మార్పులు చేస్తున్నారు. మాదక ద్రవ్యాలు, మహిళల అక్రమ రవాణా నేపథ్యంలో దీన్ని తెరకెక్కించనున్నారు. చెడు అలవాట్ల వల్ల కలిగే దుష్ఫలితాలపై యువతకు అవగాహన కలిగించేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నారు. పూర్వ నిర్మాణానంతర పనులు ముగింపు దశలో ఉన్నాయి’’ అని సన్నిహితవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ‘వా వతియారే’ చిత్రీకరణలో ఉన్నాడు కార్తి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని