పుష్ప పుష్ప పుష్పరాజ్‌

‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్‌...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు.

Published : 25 Apr 2024 01:15 IST

‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్‌...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప 2’. విజయవంతమైన ‘పుష్ప: ది రైజ్‌’కి కొనసాగింపుగా రూపొందుతోంది. ది రూల్‌... అనేది ఉపశీర్షిక. రష్మిక  కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.రవి శంకర్‌ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇటీవలే టీజర్‌ని విడుదల చేశారు. పాటల విడుదలతో ప్రచార హంగామాకి మరింత ఊపు తీసుకు రానున్నారు. అంచనాలకి దీటుగా సినిమా రూపొందుతోందని చిత్రవర్గాలు తెలిపాయి. ఫహాద్‌ ఫాజిల్‌, ధనుంజయ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, పాటలు: చంద్రబోస్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌: ఎస్‌.రామకృష్ణ, మోనిక నిగొత్రే, ఛాయాగ్రహణం: మిరోస్లా క్యూబా బ్రోజెక్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని