సరికొత్త రొమాంటిక్‌ లవ్‌స్టోరీ

వాసుదేవ్‌ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘సిల్క్‌ శారీ’.

Published : 19 May 2024 00:32 IST

వాసుదేవ్‌ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘సిల్క్‌ శారీ’. టి.నాగేందర్‌ తెరకెక్కించిన ఈ సినిమాని కమలేష్‌ కుమార్‌ నిర్మించారు. ఇది ఈనెల 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. నటులు మురళీ మోహన్, శ్రీకాంత్, శివాజీ రాజా, ఉత్తేజ్‌ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. ‘‘టీజర్, ట్రైలర్‌ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ కొత్త ప్రయత్నాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఇదొక సరికొత్త రొమాంటిక్‌ లవ్‌స్టోరీ. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు టి.నాగేందర్‌. ఈ కార్యక్రమంలో వాసుదేవ్‌ రావు, రీవా, కమలేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని