ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కథ మిరాయ్‌

మంచు మనోజ్‌ వెండితెరపై కనిపించి 8ఏళ్లు పూర్తవుతోంది. ఇన్నేళ్ల విరామం తర్వాత ఇప్పుడాయన ‘మిరాయ్‌’తో తిరిగి తెరపైకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

Published : 21 May 2024 00:45 IST

మంచు మనోజ్‌ వెండితెరపై కనిపించి 8ఏళ్లు పూర్తవుతోంది. ఇన్నేళ్ల విరామం తర్వాత ఇప్పుడాయన ‘మిరాయ్‌’తో తిరిగి తెరపైకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని కార్తీక్‌ ఘట్టమనేని తెరకెక్కిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. రితికా నాయక్‌ కథానాయిక. సోమవారం మంచు మనోజ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ఆయన పాత్రను పరిచయం చేస్తూ చిత్ర బృందం హైదరాబాద్‌లో ఓ గ్లింప్స్‌ను విడుదల చేసింది. మనోజ్‌ ఇందులో ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన, ప్రమాదకరమైన బ్లాక్‌ స్వార్డ్‌ అనే తెగకు చెందిన వాడిగా శక్తిమంతమైన ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. ఈ ప్రచార చిత్రంలో జులపాల జుత్తు, కళ్లజోడుతో తను స్టైలిష్‌గా కనిపించిన తీరు.. తనకెదురొచ్చిన వారిని కత్తితో చీల్చి చెండాడుతూ చేసిన విధ్వంసం ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి. ఈ సందర్భంగా మంచు మనోజ్‌ మాట్లాడుతూ.. ‘‘అశోకుని తొమ్మిది రహస్య పుస్తకాల గురించిన కథ ఇది. ప్రతి ఒక్కరూ ఈ కథ తెలుసుకోవాలని ఆశిస్తున్నా. దర్శకుడు కార్తీక్‌ ఈ స్క్రిప్ట్‌ను ఎంత చక్కగా రాసుకున్నారో.. అంతే అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చారు. ఇది రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి పార్ట్‌ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 18న ప్రేక్షకుల ముందుకొస్తుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్తీక్‌ ఘట్టమనేని, గౌర హర తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని