పాత్ర కోసం నిజమైన బంగారం

భారతీయ పురాణేతిహాసం రామాయణం ఆధారంగా నితేష్‌ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’. రాముడిగా రణ్‌బీర్‌ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.

Published : 21 May 2024 00:48 IST

భారతీయ పురాణేతిహాసం రామాయణం ఆధారంగా నితేష్‌ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’. రాముడిగా రణ్‌బీర్‌ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ దశలో ఉన్న ఈ భారీ బడ్జెట్‌ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. దీంట్లో రావణుడి పాత్రలో యశ్‌ ధరించనున్న దుస్తులు, ఆభరణాలు, వాడే వస్తువులు అన్నీ నిజమైన బంగారంతో తయారు చేసినవే వినియోగించనున్నట్లు సమాచారం. ఎందుకంటే రావణుడు స్వర్ణ నగరమైన లంకకు అధిపతి. ఆయన ధరించిన వస్త్రాలు కూడా పసిడి మయమేనని ఇతిహాసాల్లో చెప్పారు. అందుకే సినిమాలోనూ ఆ పాత్రను అలాగే చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో యశ్‌ ముఖ్య పాత్ర పోషించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. దీన్ని భారతీయ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లోనూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని