దీపావళికి కంగువా..?

మరికొద్ది రోజుల్లో థియేటర్లలో తన పరాక్రమం చూపించడానికి సిద్ధమవుతున్నారు తమిళ అగ్ర కథానాయకుడు సూర్య. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కంగువా’. శివ తెరకెక్కిస్తున్నారు.

Published : 21 May 2024 00:52 IST

మరికొద్ది రోజుల్లో థియేటర్లలో తన పరాక్రమం చూపించడానికి సిద్ధమవుతున్నారు తమిళ అగ్ర కథానాయకుడు సూర్య. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కంగువా’. శివ తెరకెక్కిస్తున్నారు. దిశా పటానీ కథానాయిక. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇందులో సూర్య-బాబీల మధ్య వచ్చే క్లైమాక్స్‌ సన్నివేశాలను దాదాపు 10వేల మందితో తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా దీన్ని ఈ ఏడాది దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో ఈ వివరాల్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇందులో ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నారు సూర్య. కంగ అనే ఓ పరాక్రముడి కథతో పీరియాడికల్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని