రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘కుబేర’ సందడి

ధనుష్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కుబేర’. ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అగ్ర హీరో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఆయన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది.

Published : 22 May 2024 01:11 IST

నుష్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కుబేర’. ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అగ్ర హీరో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఆయన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరిగింది. గుడి నేపథ్యంలో సాగే సీన్స్‌తో పాటు మరిన్ని ప్రత్యేక సన్నివేశాలను ధనుష్‌ తదితరులపై తెరకెక్కించారు. రష్మిక, జిమ్‌ సర్బ్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏక కాలంలో తీర్చిదిద్దుతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, అమిగోస్‌ క్రియేషన్స్‌ ప్రై.లి పతాకాలపై సునీల్‌ నారంగ్, పుస్కుర్‌ రామ్‌ మోహన్‌రావు నిర్మిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని