క్రిమినల్‌ ఎవరు?

అదా శర్మ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం... ‘సి.డి’ (క్రిమినల్‌ ఆర్‌ డెవిల్‌). కృష్ణ అన్నం దర్శకత్వం వహించడంతోపాటు...ఎస్‌.ఎస్‌.సి.ఎమ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై స్వీయ నిర్మాణంలో రూపొందించారు.

Published : 23 May 2024 05:59 IST

అదా శర్మ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం... ‘సి.డి’ (క్రిమినల్‌ ఆర్‌ డెవిల్‌). కృష్ణ అన్నం దర్శకత్వం వహించడంతోపాటు...ఎస్‌.ఎస్‌.సి.ఎమ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై స్వీయ నిర్మాణంలో రూపొందించారు. నేర నేపథ్యంలో సాగే ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయినట్టు చిత్రవర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఈ నెల 24న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘‘విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రమిది. యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్‌ అంశాలతోపాటు.. ఈ కథలో క్రిమినల్‌ ఎవరు? డెవిల్‌ ఎవరనేది ఆసక్తికరం. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్‌లు  అంచనాలు పెంచాయి. అందుకు దీటుగా సినిమా ఉంటుంది’’ అన్నారు దర్శకనిర్మాత. విశ్వంత్, జబర్దస్త్‌ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేశ్‌ విట్టా తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సతీశ్‌ ముత్యాల, సంగీతం: ఆర్‌.ఆర్‌.ధృవన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని