భారతీయ లఘు చిత్రానికి పురస్కారం

యావత్తు చిత్రపరిశ్రమ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే కేన్స్‌ చిత్రోత్సవాలు ఎంతో వైభంగా జరుగుతున్నాయి. ఇప్పుడీ వేడుకలో భారతదేశం మరో అరుదైన ఘనతను దక్కించుకుంది.

Published : 25 May 2024 00:45 IST

యావత్తు చిత్రపరిశ్రమ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే కేన్స్‌ చిత్రోత్సవాలు ఎంతో వైభంగా జరుగుతున్నాయి. ఇప్పుడీ వేడుకలో భారతదేశం మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. ఇండియాకు చెందిన ‘సన్‌ఫ్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్‌ వన్స్‌ టు నో’ అనే లఘు చిత్రానికి లా సినెఫ్‌ అవార్డు దక్కింది. దాదాపు 17 చిత్రాలతో పోటీపడీ ఉత్తమ షార్ట్‌ ఫిలిమ్‌గా మొదటి బహుమతిని అందుకుంది. కన్నడ జానపద కథ ఆధారంగా దీన్ని చిదానంద ఎస్‌ నాయక్‌ రూపొందించారు. పుణెలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలో టెలివిజన్‌ విభాగంలో సంవత్సర కాలపరిమితి ఉన్న కోర్సులో భాగంగా ఈ షార్ట్‌ ఫిల్మ్‌ను రూపొందించారు చిదానంద. 16 నిమిషాల నిడివి ఉన్న ఈ లఘు చిత్రంలో.. ఓ వృద్ధురాలి కోడిని ఎవరో దొంగిలించడం, దాన్ని వెతకడం కోసం ఆమె పడుతున్న తపన, ప్రయత్నాలను ఇందులో చూపించిన విధానం సినీప్రియుల్ని మెప్పించింది. దీంతో పాటు ‘బన్నీ హుడ్‌’ అనే మరో భారతీయ యానిమేటెడ్‌ చిత్రం ఈ పోటీలో మూడో బహుమతిని సొంతం చేసుకుంది. దీన్ని చిత్రనిర్మాత మహేశ్వరి రూపొందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని