డూప్‌ లేకుండా ‘సికందర్‌’ యాక్షన్‌

బాలీవుడ్‌ అగ్రకథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సికందర్‌’. ప్రముఖ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ దీన్ని తెరకెక్కిస్తున్నారు.

Published : 25 May 2024 00:53 IST

బాలీవుడ్‌ అగ్రకథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సికందర్‌’. ప్రముఖ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ దీన్ని తెరకెక్కిస్తున్నారు. రష్మిక కథానాయిక. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే నెలలో మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ‘‘మేలోనే షురూ కావాల్సిన ఈ ప్రాజెక్టు షూటింగ్‌ కొన్ని కారణాల వల్ల జూన్‌లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్‌ పనులు ముగింపు దశలో ఉన్నాయి. ఇందులోని యాక్షన్‌ సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. జూన్‌ 20న మొదలు కానున్న ఈ మొదటి షెడ్యూల్‌లో భాగంగా యాక్షన్‌ సీక్వెన్స్‌లనే చిత్రీకరించనున్నారు. విశేషమేంటంటే..ఈ చిత్రంలోని సన్నివేశాలను సల్మాన్‌ స్వయంగా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీని కోసం ఇప్పటికే ఆయన కసరత్తులు కూడా ప్రారంభించార’’ని చిత్రవర్గాలు తెలిపాయి. సాజిద్‌ నడియాడ్‌ వాలా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఈద్‌కి విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని