27ఏళ్ల తర్వాత మళ్లీ కలిశారు

నిఖిల్‌ ‘స్పై’ చిత్రాన్ని నిర్మించిన చరణ్‌తేజ్‌ ఉప్పలపాటి ఇప్పుడు బాలీవుడ్‌లోకి దర్శకుడిగా అడుగు పెట్టనున్నారు. ప్రస్తుతం ఆయన హిందీలో సీనియర్‌ స్టార్‌ నాయిక కాజోల్‌తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు.

Published : 25 May 2024 00:57 IST

నిఖిల్‌ ‘స్పై’ చిత్రాన్ని నిర్మించిన చరణ్‌తేజ్‌ ఉప్పలపాటి ఇప్పుడు బాలీవుడ్‌లోకి దర్శకుడిగా అడుగు పెట్టనున్నారు. ప్రస్తుతం ఆయన హిందీలో సీనియర్‌ స్టార్‌ నాయిక కాజోల్‌తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆమెతో 27ఏళ్ల క్రితం ‘మెరుపు కలలు’ చిత్రంలో కలిసి సందడి చేసిన ప్రభుదేవా ఇందులో మళ్లీ తనతో తెర పంచుకోనుండటం విశేషం. ఇదొక భిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందుతున్నట్లు సమాచారం. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ పూర్తయింది. త్వరలో టీజర్‌ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతోనే సంయుక్తా మేనన్‌ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తనిందులో రెండో నాయికగా కనిపించనుంది. అలాగే నసీరుద్దీన్‌ షా కీలక పాత్ర పోషిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని