హిట్‌ లిస్ట్‌ అలరిస్తుంది

తమిళ దర్శకుడు విక్రమన్‌ తనయుడు కనిష్క కథానాయకుడిగా నటించిన చిత్రం ‘హిట్‌ లిస్ట్‌’. సూర్య కతిర్‌ కాకల్లార్, కె.కార్తికేయన్‌ దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ నిర్మాత. సముద్రఖని, శరత్‌కుమార్, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ కీలక పాత్రలు పోషించారు.

Published : 26 May 2024 00:44 IST

మిళ దర్శకుడు విక్రమన్‌ తనయుడు కనిష్క కథానాయకుడిగా నటించిన చిత్రం ‘హిట్‌ లిస్ట్‌’. సూర్య కతిర్‌ కాకల్లార్, కె.కార్తికేయన్‌ దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ నిర్మాత. సముద్రఖని, శరత్‌కుమార్, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీనివాస్‌ గౌడ్, బెక్కం రవీంద్ర విడుదల చేస్తున్నారు. ఈ సినిమా విడుదలకి ముందస్తు వేడుకని ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్, ప్రముఖ నటుడు మురళీమోహన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కథానాయకుడు విజయ్‌ కనిష్క మాట్లాడుతూ ‘‘మా నాన్న విక్రమన్‌  తెలుగు, తమిళంలో చాలా మంచి సినిమాలు తీశారు. తొలి తెలుగు చిత్రంగా వెంకటేశ్‌తో ‘వసంతం’ చేశారు. తెలుగు ప్రేక్షకులు, పరిశ్రమ వర్గాలు మా నాన్నకి గొప్ప సహకారం అందించారు. అదే సహకారం నాకూ లభిస్తుందని ఆశిస్తున్నా. బాగా నచ్చిన కథతో ‘హిట్‌ లిస్ట్‌’ రూపొందింది. తప్పకుండా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అన్నారు. నిర్మాత కె.ఎస్‌.రవికుమార్‌ మాట్లాడుతూ ‘‘పరిశ్రమకి వచ్చిన కొత్తలో పదేళ్లు సహాయ దర్శకుడదిగా పనిచేశా. ఆ క్రమంలో విక్రమన్‌ సార్‌తో మంచి అనుబంధం ఏర్పడింది. ఆయన తనయుడు విజయ్‌ కనిష్కని ఇప్పుడు నేను పరిచయం చేస్తుండడం ఆనందంగా ఉంది. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు. మురళీమోహన్‌ మాట్లాడుతూ ‘‘నాకు బాగా సన్నిహితుడైన కె.ఎస్‌.రవికుమార్‌ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించడం మంచి పరిణామమం. కనిష్క చాలా బాగా నటించాడు. ట్రైలర్‌ బాగుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని