‘జీ లే జరా’ ఆగి పోలేదు!

మూడేళ్ల కిందటే అలియా భట్, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రాలతో ‘జీ లే జరా’ ప్రకటించారు ఫర్హాన్‌ అక్తర్‌. రోడ్‌ ట్రిప్‌ కథాంశంతో సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉంటుందని పేర్కొన్నారు.

Published : 26 May 2024 00:51 IST

మూడేళ్ల కిందటే అలియా భట్, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రాలతో ‘జీ లే జరా’ ప్రకటించారు ఫర్హాన్‌ అక్తర్‌. రోడ్‌ ట్రిప్‌ కథాంశంతో సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉంటుందని పేర్కొన్నారు. అయితే రకరకాల కారణాలతో ఈ చిత్రం ఇంతవరకు ముందుకు కదల్లేదు. ఒకానొక సమయంలో ఈ ప్రాజెక్టు ఆగిపోయినట్టే అనే సందేహాలూ వెలువడ్డాయి. ఇప్పుడు వాటన్నింటికీ తెర దించుతూ తాజాగా ఓ తీపి కబురు వినిపించాయి చిత్రవర్గాలు. ‘ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ‘జీ లే జరా’ని కొన్నాళ్లు ఆపేసిన మాట వాస్తవం. దానికి కారణం నాయికల తేదీల సర్దుబాటు కుదరకపోవడమే. అంతేగానీ ఈ ప్రాజెక్టుని మేం ఆపేయలేదు. కొన్ని మార్పులతో ప్రస్తుతం స్క్రిప్ట్‌ని పూర్తిగా సిద్ధం చేశాం. ఇది దర్శకనిర్మాతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు. త్వరలోనే పట్టాలెక్కిస్తాం’ అని నిర్మాణ సంస్థ ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. కత్రినా, అలియాలతో ఫర్హాన్‌ ఇప్పటికే చర్చలు జరిపారనీ.. ప్రియాంక చోప్రా ఈ మధ్య భారత్‌ వచ్చినప్పుడు స్వయంగా వెళ్లి కలిశారని వివరణ ఇవ్వడంతో.. ఈ మల్టీస్టారర్‌ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని