పాయల్‌ కపాడియాకి మోదీ శుభాకాంక్షలు

కేన్స్‌ చిత్రోత్సవాల్లో అత్యున్నత పురస్కారం గెల్చుకున్న ‘ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’ చిత్ర దర్శకురాలు పాయల్‌ కపాడియాకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

Published : 27 May 2024 01:04 IST

కేన్స్‌ చిత్రోత్సవాల్లో అత్యున్నత పురస్కారం గెల్చుకున్న ‘ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’ చిత్ర దర్శకురాలు పాయల్‌ కపాడియాకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె.. ప్రభుత్వ ఆధ్యర్యంలో నిర్వహించే పుణెలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌టీఐఐ) పూర్వ విద్యార్థి కావడం ఘనమైన భారతీయ సృజనాత్మకు నిదర్శనం అని కొనియాడారు. ‘పాయల్‌ ఉత్తమ దర్శకురాలిగా నిలవడం ఆమె అనన్య సామాన్యమైన ప్రతిభకి కొలమానమే కాదు.. ఆమె ఔత్సాహిక సినీ భావితరాలకు స్ఫూర్తిగానూ నిలిచారు’ అని ఎక్స్‌ ద్వారా ప్రశంసించారు. గత ముప్ఫై ఏళ్లలో ఏ భారతీయ మహిళా దర్శకురాలు కేన్స్‌ చిత్రోత్సవాల్లో సినిమా ప్రధానమైన విభాగంలో పోటీ పడలేదు. అలాంటిది పాయల్‌ తెరకెక్కించిన ‘ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’ ఏకంగా ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లోనే రెండో అత్యుత్తమ పురస్కారం గ్రాండ్‌ప్రిక్స్‌ని గెల్చుకొని సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని