వారసుల తొలి జోరు

షారుక్‌ ఖాన్, ఆమిర్‌ఖాన్‌లు బాలీవుడ్‌లో సూపర్‌స్టార్లు. అలాంటి స్టార్ల వారసుల చిత్రాలు అంటే కూడా అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది.

Published : 27 May 2024 01:09 IST

షారుక్‌ ఖాన్, ఆమిర్‌ఖాన్‌లు బాలీవుడ్‌లో సూపర్‌స్టార్లు. అలాంటి స్టార్ల వారసుల చిత్రాలు అంటే కూడా అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఆ ఇద్దరు వారసులూ తాజా కబురు వినిపించారు. ఒకరు దర్శకుడిగా తొలి అడుగు వేస్తుండగా.. మరొకరు తెరపై నటనెంతో నిరూపించుకోనున్నారు.

ఆర్యన్‌ఖాన్‌ ‘స్టార్‌డమ్‌’ పూర్తైంది

గ్ర కథానాయకుడు షారుక్‌ఖాన్‌ వారసుడు ఆర్యన్‌ఖాన్‌ దర్శకుడిగా ‘స్టార్‌డమ్‌’ అనే వెబ్‌సిరీస్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సొంత నిర్మాణ సంస్థ రెడ్‌చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రూపొందుతోంది. ఇది స్వయంగా షారుక్‌ జీవితం స్ఫూర్తితో రూపొందించిన సిరీస్‌. బాబీ దేవోల్‌ ప్రధాన పాత్ర పోషించగా.. రణ్‌బీర్‌ కపూర్, కరణ్‌ జోహార్, రణ్‌వీర్‌సింగ్, అనన్య పాండే తదితరులు అతిథి పాత్రల్లో మెరిశారు. ఆదివారం షూటింగ్‌ పూర్తైంది. ఈ సందర్భంగా చిత్రబృందమంతా షూటింగ్‌ ముగింపు వేడుక చేసుకుంది. ఆ వివరాలు, ఫొటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మరోవైపు ఆర్యన్‌ఖాన్‌ పనితనం ఎలా ఉందో తెలుసుకోవడానికి అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

జూన్‌లో వస్తున్న ‘మహరాజ్‌’ జునైద్‌ ఖాన్‌

మిర్‌ఖాన్‌ నట వారసుడు జునైద్‌ నటిస్తున్న తొలి చిత్రం ‘మహరాజ్‌’. ఈ డ్రామా చిత్రానికి సిద్ధార్థ్‌ పి మల్హోత్రా దర్శకత్వం వహించారు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించింది. కొద్దినెలల కిందటే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. అనివార్య కారణాలతో విడుదల ఆలస్యమవుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమాని జూన్‌ 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తర్వాత దీన్ని ఇతర విదేశీ భాషల్లో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. శార్వరీ వాఘ్, జైదీప్‌ ఆహ్లావత్, షాలినీ పాండే.. ఇతర కీలక పాత్రల్లో నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని